Author

Raj

"అవధులు లేని నా కలానికి స్వేచ్ఛ కావాలి, ఆ స్వేచ్ఛ లో నేను రాసే రాతలు ప్రతి గుండెలో దిగబడాలి "

Category Poetry
Language Telugu

Author's books

Neti Samajam

170.00
By

ఎంతటి వెర్రి వాడిని నేను
నేను రాసే ఈ అక్షరాలతో
ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను
ఎవడు చదువుతాడు
నేను రాసే ఈ పుస్తకాన్ని
ఎవడు వింటాడు
నా పుస్తకం లో దాగి ఉన్న ఘోషని.
తెలుగు సరిగా చదవటం రాని నేటి యువతకి
మంచం మీద ముసలిదాని గురుంచి చెబుతున్నాను
కామకులకి
ఒక చిట్టితల్లి నరకాయతాన్ని చెప్పుచున్నాను
ఒళ్ళు బద్దకంతో ఉన్న నేటి యువతరానికి
కష్టాల గురుంచి చెప్పుచున్నాను
ఎంతటి వెర్రి వాడిని నేను
నేను రాసే ఈ అక్షరాలతో
ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను