Blog

శేఖరయ్య… ఓ శేఖరయ్యా..

ఆ.. అంటూ పరధ్యానంగా బదులిచ్చాడు బ్నిమ్ సైకిల్ మార్ట్ ఓనర్ అయిన శేఖర్.

“ఈరోజు సొగం దినం సెలవు కావాలయ్య, మా సీను గాడి పుట్టినరోజు ఇయ్యాల.. మా ఇంటిది రాత్రికి కూరాకు వండుతా కోడి తీసుకరమ్మంది.. “ ఒరాలింగ్ వచ్చిన సైకిల్ రిమ్ బెండు తీస్తా చెప్పాడు ఓబులేసు..

ఇంతలో ఏదో కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది శేఖర్ కి.. నెంబర్ ఇంతకు ముందు సూసినట్టుందే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు..

శేఖరయ్య, నేను సావిత్రిని మాట్లాడుతున్న ఓబులేసు పెండ్లాన్ని..మా ఆయన పనికి వచ్చినాడ? మా సీను కాలేజీ ఫస్ట్ వచ్చాడంటయ్యా.. మా ఆయనకి సెప్పయ్య అట్ట.. సంతోషంతో గబగబా చెప్పింది.

“లోలోపల నవ్వుకుంటూ.. ఈడనే ఉన్నాడు నీ పెనిమిటి.. ఫోన్ ఇస్తాండా నువ్వే చెప్పు” అంటూ ఫోన్ ఓబులేసుకి ఇచ్చాడు.

ఎవరు సామీ.. అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఓబులేసు..

మాట్లాడు తెలుస్తాది.. అన్నాడు శేఖర్

పని కాడ ఉన్నప్పుడు.. శేఖర్ ఫోన్ కి తన పెండ్లం తప్ప ఎవరు ఫోన్ చేయరు అని గుర్తొచ్చి..

“ఏంది మే.. పని కాడ ఉన్నప్పుడు సీటీకిమాటికి అయ్య  సెల్లుకి ఫోన్ చేయకు మన్నే కదా” అంటూ కసురుకున్నాడు ఓబులేసు.

బావ మన సీను కాలేజీ ఫస్టు వచ్చినాడు అంట, ఇందాక వెంకటేశం సారు ఇంటి కాడికి వచ్చి న్యూస్ పేపర్ ఇచ్చి పోయినాడు..

ఓబులేష్ కి ఆనందంతో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. ఆ సరే అంటూ ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి కళ్ళ నీళ్లు తుడుచుకొని ఫోన్ శేఖర్ చేతికి ఇస్తూ ఇలా చెప్పాడు.

శేఖరయ్య నా కొడుకు కాలేజీ ఫస్ట్ వచ్చినాడు అంట వాళ్ల సారు ఇంటికాడికి వచ్చి చెప్పి పోయినాడు..

ఇన్యాలెబ్బ..

కొత్త సైకిల్ ఆర్డర్స్ ఏమీ లేవు.. ఈరోజుకి సెలవు తీసుకొని ఇంటికి పో.. పోతా పోతా తంగేడి పల్లి మైసూర్ పాక్ తీసుకొని పో ఇంటికి.. అంటూ 500 రూపాయల నోటు చేతికి ఇచ్చాడు.

లేదయ్యా ఈ సైకిల్ పూర్తి చేసి పోతా..  అంటూ సైకిల్ దగ్గరకొచ్చి మళ్లీ పని మొదలు పెట్టాడు ఓబులేసు .

ఓరాలింగ్ కి వచ్చిన సైకిల్ అవడం వల్ల ఎంత త్వరగా చేసినా కూడా మధ్యాహ్నం మూడు అయింది పూర్తి అయ్యేసరికి.. శేఖరయ్య సైకిల్ పని పూర్తయింది కస్టమర్ వస్తే  ఇచ్చేయ్య..  అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు ఓబులేసు.

శివాలయం దగ్గర ఉన్న తంగేడి పల్లి స్వీట్ షాప్ లో ఒక అర్థ కేజీ మైసూర్ పాక్ తీసుకొని,  ఊరి  బయట బైపాస్ రోడ్డు పక్కన ఉన్న సదాశివం కోళ్ల ఫారం వైపుకి వెళ్ళాడు ఓబులేసు.

ఓబులేసు చిన్నప్పుడు , ఇంట్లో  ఎప్పుడు కోళ్లు మేకలు ఉండేవి మాంసం తినాలి అనుకున్నప్పుడు అతని నాన్న,జేజి ఇద్దరు కలిసి కోడిని కాల్చి ఈకలు అవి తీసేసి సంగటి ముద్ద చేసుకునే బండమీద ముక్కలు కోసుకొని వండుకొని తినేవాళ్లు. ఓబులేసుకి అదే అలవాటయింది, కోడి కూర ఎప్పుడు తినాలనుకున్నా కోళ్ల ఫారం నుండి కోడి తెచ్చుకొని వాళ్ల వీధి చివరన ఉన్న హుస్సేన్ సాయబుతో హలాల్ చేయించి సంగటి చేసుకునే బండమీద ముక్కలు కోసి వండుకొని తింటాడు.

 ఆదివారం రోజు చికెన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి రెండు నుంచే పని మొదలు పెట్టాల్సి ఉంటుంది, అందుకనే శనివారం రోజు సాయంత్రం నాలుగు కల్లా పౌల్ట్రీ మూసేసి ఇండ్లకు వెళ్లిపోతారు అక్కడ పనిచేసే వాళ్లు.

పౌల్ట్రీ గేటు మూసే టైం కి కోళ్ల ఫారం చేరుకున్నాడు ఓబులేసు.. అక్కడ పనిచేసే అతను గేట్ తెరవడానికి అవదు అని ఎంత చెప్తున్నా వినలేదు. చివరికి అతని ఎలాగోలా బతిమాలి ఒప్పించి లోపలికి వెళ్ళాడు.. లోపలికి వెళ్లిన ఓబులెసు కి అక్కడి వాతావరణం ఎందుకో సరిగా అనిపించలేదు.. అక్కడున్న కోళ్లు ఏదో ఆవహించినట్టు అరుస్తున్నాయి.. బోన్ లో ఉన్నప్పటికీ ఎగిరెగిరి పడుతున్నాయి.

ఏంది తమ్ముడు ఇట్లా అరుస్తున్నాయి కోళ్ళు ఎట్టా పని చేస్తున్నావు ఈడ.. పిచ్చెక్కుతాది ఇట్లనే ఉంటే.. ఓబులేసు అక్కడ పనిచేసే అతనితో  అన్నాడు

ఏమో అన్న.. మామూలు రోజుల్లో బానే ఉంటాయి.. ఇదో ఈ శనివారం రోజు వస్తాయి కదా కోళ్లు అవి మాత్రమే అరుస్తుంటాయి.. మా ఓనర్ కి చాలాసార్లు చెప్పినా శనివారం రోజు కోళ్లను తెప్పియాకయ్యా అని.. మన మాట ఎందుకు వింటారు అన్న ఓనర్లు. రెండు మూడుసార్లు చెప్పి ఇంకా వదిలేసినా నేను కూడా.. మల్ల రాత్రి మేము వచ్చే టయానికల్లా గమ్మునైపోతాయి అరిచి అరిచి.. అని చెప్తూ బోనులోంచి ఒక కోడిని తీసి దాని కాళ్ళను గట్టిగా పురికోసతో కట్టి ఓబులేసు చేతికి ఇచ్చినాడు.

ఒక 200 రూపాయలు అతన్ని చేతికి ఇచ్చి నేరుగా హుస్సేన్  ఇంటికి పోయినాడు ఓబులేసు..

భాషన్న కోడిని తెచ్చిన కొంచెం కోసిజ్జురా అంటూ  వాకిటి బయట నిలబడి గట్టిగా అరిచాడు ఓబులేసు..

వస్తాండా రెండు నిమిషాలు ఆగు..  అంటూ లోపల నుండి చెప్పాడు హుస్సేన్..

ఒక ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చిన హుస్సేన్ ఓబులేసుని చూసి..

క్యా రే ఓబులేసు శనివారం దినం కోడిని తింటున్నావా.. సావిత్రి మార్దాల్తి.. ఆజ్ ఆదివారం నై.. ఆదివారం అనుకొని కోడి తెచ్చాడు అనుకున్నాడు హుస్సేన్

సావిత్రే చెప్పింది భాష అన్న.. ఈరోజు కొడుకుకి కోడి బువ్వ పెట్టాలి అంట.. ఈరోజు వాడి పుట్టినరోజు.

కొడుకు అంటే గుర్తొచ్చింది నీ కొడుకు పాస్ అయినాడా పరీక్షలు..నా మన్మడు చెప్పాడు ఆజ్ రిజల్ట్స్ వస్తాయి అని.. అడిగాడు హుస్సేన్

పాసు కాదు బాషన్న కాలేజీ ఫస్ట్ వచ్చినాడు నా కొడుకు..చెప్పాడు ఓబులేసు

మాషా అల్లా.. మాషా అల్లా.. సావిత్రి కో బోలో ముజే బిర్యానీ

ఖిలానే కేలియే..

తప్పకుండా చెప్తా భాషన్న అని చెప్పి.. హలాల్ చేయడానికి రెడీ అయ్యారు ఇద్దరు.

హలాల్ చేసే ముందు కోడికి నీళ్లు తాపిస్తారు అలా తాపించడానికి నోరు విప్పడానికి ప్రయత్నించాడు ఏదో దుష్టశక్తి ఆవహించినట్టు ఎంతకి నోరు విప్పడం లేదు అది.. ఎగిరెగిరి పడుతుంది.. ఎలాగోలా కష్టపడి హలాల్ చేశాడు హుస్సేన్.

కిదర్ సే లాయరే ఇసే.. కబీ నై దేఖ ఐసీముర్గీ..  అన్నాడు హుస్సేన్

సదాశివం కోళ్ల ఫారం నుండి తీసుకొచ్చా భాషన్న అని చెప్పాడు ఓబులేసు

అచ్చ.. టీకే టీకే..  బిర్యానీ బేజో..  బులో మత్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు హుస్సేన్

*******************************************************************************************************

కాళ్లు చేతులు  కడుక్కోకుండానే లోపలికి వెళ్ళాడు ఓబులేసు.. సావిత్రి.. ఓ సావిత్రమ్మ..  ఏడ నా కొడుకు యాడున్నాడే పిలుసు వాడిని.

పొద్దున అనగా పోయినాడు బావ ఇంటికి రాలేదు ఇంకా వాడు ..లోపలి నుండి వస్తూ చెప్పింది సావిత్రి

కీర్కెట్ ఆడుతుంటాడు లే.. ఆకలితో వస్తాడేమో తొందరగా వంట కి రెడీ చెయ్.. వెళ్తా వెళ్తా ఆ సంగటి  బండ బయటపెట్టి వెళ్ళు కోడిని తెచ్చిన ..

భార్యాభర్తలిద్దరూ సంతోషంతో ముసిమాసిగా నవ్వుకుంటూ తమ పనులను చేసుకోవడానికి వెళ్లారు.

(40 నిమిషాల తర్వాత కోడి కూర వన్డటం పూర్తయింది )

క్రికెట్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు శీను.

కోడికూరలో నంజుకోవడానికి ఎర్రగడ్డలు కోస్తున్న తండ్రిని చూసి.. ఏం నాయనా పనికాన్నుంచి  అప్పుడే వచ్చినావు ఒంట్లో బాలేదా.. అంటూ జరమేమైనా ఉందా అని చూస్తున్నట్లు తండ్రి చెయ్యి పట్టుకుని చూశాడు శీను.

నాకేం కాలేదు లేరా..

అవుబి పరీక్షల రిజల్ట్స్ ఈరోజు వస్తాయన్నావు కదా చూసుకున్నావా .. అడిగాడు ఓబులేసు

అవును నాయనా ఈరోజు వచ్చి ఉంటాయి.. పాస్ అయిత.. పరీక్షలు బానే రాసినా కదా. రేపు కాలేజీ కాడికి పోయి చూసుకొని వస్తా అంటూ తండ్రి మెడ మీద చుట్టూ చేతులు వేసి చెప్పాడు శీను

చూసినావమే  సావిత్రి నా కొడుకు ఎంత ధైర్యంగా ఉండాడో.. పులిబిడ్డ మే నా కొడుకు

ఒరేయ్ కొడకా.. రేపు కాలేజీకి పోవాల్సిన పనిలేదు రా. మీ సారు ఇంటికి వచ్చి చెప్పి పోయినాడు నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చినావని.

తండ్రి కొడుకులు ఇద్దరిని చూస్తూ ముసి ముసిగా నవ్వుకుంటుంది పొయ్యి దగ్గర నుండి సావిత్రి

అమ్మ బాగా ఆకలేస్తుంది అన్నం పెట్టు ..అంటున్న శీను ని మధ్యలోనే ఆపి ..అయిపోయింది బిడ్డ అదే చెప్తున్నా కాళ్లు చేతులు కడుక్కొని రాపో అన్నం తినేసి పడుకుందువు అంటూ పొయ్యి మీద ఉన్న అన్నం గిన్ని ని దించుతూ చెప్పింది సావిత్రి.

మ్మే సావిత్రి నేను అట్ట చిన్నోడి కాడికి  పోయి వస్తా..  నీ కొడుకుని తిని పడుకోమని చెప్పు.. అంటూ తన తమ్ముడింటికి బయలుదేరాడు ఓబులేసు.

(రెండు గంటల తర్వాత..)

బావ బావ అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ మరిది ఇంటికి వచ్చింది సావిత్రమ్మ

ఏమి ..ఏమైంది.. ఏమైంది.. అంటూ లోపల నుండి బయటకు వచ్చాడు ఓబులేసు

సీను  .. సీను .. గొంతుకు ఏదో అడ్డం పడినట్లు చెప్పలేకపోయింది సావిత్రమ్మ

ఆ సీను కు ఏమైంది గట్టిగా అరిచాడు.. సావిత్రి మాట పూర్తి చేయకముందే ఇంటి వైపుకు పరిగెత్తాడు

మంచం మీద కట్టేలాగా బిగుసుకుపోయి ఉన్నాడు శీను.. అది చూసిన ఓబులేసు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణిక కాలం పాటు మెదడు ముద్దు పారిపోయింది. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు .

అంతలో అటుగా పరిగెత్తుకుంటూ వచ్చిన తమ్ముని ఆటో తీసుకురమ్మని చెప్పి తను సుబ్బయ్య ఆసుపత్రి వైపు పరిగెత్తాడు.

సుబ్బయ్య.. నా కొడుకు సుబ్బయ్య..  రా.. అంటూ మాట పూర్తి చేయలేకపోయాడు.. ఏడుస్తున్నాడు..

ఏదో ఎమర్జెన్సీ లాగా అర్థమయిన సుబ్బయ్య డాక్టర్ , చూస్తున్న కేసిన నర్సు కి అప్పగించి తన ఎమర్జెన్సీ కిట్టు తీసుకొని ఓబులేసి ఇంటికి వెళ్లడానికి బండిని స్టార్ట్ చేశాడు.

సుబ్బయ్య డాక్టర్ ఓబులేసుంటున్న వీధి చివర్లో ఆర్ఎంపీ డాక్టర్ గా 40 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు.. అదేదో అంటారు కదా హస్తవాసీ  అని.. ఎన్నో లక్షలు పెట్టినా కూడా పెద్దపెద్ద స్పెషలిస్ట్ వల్ల నయం కాని జబ్బులన్నీ కూడా తన పది రూపాయలు వైద్యంతో బాగు చేసేవాడు. తన గురించి బాగా తెలిసిన కుర్ర డాక్టర్లు అప్పుడప్పుడు కష్టమైన ఆపరేషన్లు చేయాల్సి వచ్చినప్పుడు సుబ్బయ్య అభిప్రాయాల కోసం తీసుకెళ్లేవారు.

సుబ్బయ్య, ఓబులేసు ఇంటికి వెళ్లేసరికి శీను చేతులు కొట్టుకోసాగాడు. సుబ్బయ్య, శీను కళ్ళను చూసి పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి వెంటనే, పిల్లోని ఆటోలో ఎక్కించు త్వరగా టైం లేదు నా వెనకాల రండి అంటూ బండిని నక్షత్రా హాస్పిటల్ వైపు స్పీడ్ గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు.

ఓబులేసు , శీను ని అతడి తమ్ముడు ఆటోలో ఎక్కించి సుబ్బయ్య వెనకలే బయలుదేరారు. సుబ్బయ్య డ్రైవ్ చేస్తూనే నక్షత్ర హాస్పిటల్ కి ఫోన్ చేసి స్ట్రెచర్ తో పాటు డ్యూటీ డాక్టర్ని హాస్పిటల్ ఎంట్రెన్స్ లోకి రమ్మని చెప్పాడు

హాస్పిటల్ ఎంట్రన్స్ లోనే స్ట్రెచర్ తో పాటు డ్యూటీ డాక్టర్ అయిన అమృత రెడీగా ఉంది. శీను ని స్ట్రెచర్ మీదికి లాగడానికి ఒక నిమిషం అవస్థ పడాల్సి వచ్చింది కట్టే లాగా బిగుసుకుపోయి ఉన్నాడు శీను.

ఇంతలో బీపీ మానిటర్, గ్లూకోస్ మానిటర్ తో బిపి మరియు షుగర్ చెక్ చేసింది నర్స్ శాంతి. మేల్ పేషంట్, ఏజ్ 17 టు 18, బ్లడ్ షుగర్ 80ఎంజి, బిపి 240 / 130, SPO2 89% వివరాలు నోట్ చేసింది.

శీను చేతులు మళ్లీ కొట్టుకోసాగాడు.

అమృత ఫిట్స్ వస్తున్నాయి, ఇంజక్షన్ అంటూ అరిచాడు సుబ్బయ్య

పరిగెత్తింది అమృత..

శీను బుగ్గల మీద రక్తపు మరకలతో నురగ రావడం మొదలయింది.

అమృత ,మళ్లీ గబగబా బీపీ చెక్ చేసింది, 270/120 చాలా ఎక్కువ.. కనుగుడ్లు వాచి ఉన్నాయి.. ఒళ్లంతా కాలిపోతుంది.. తన దగ్గర ఉన్న టెంపరేచర్ గన్ తో చెక్ చేసింది 104 డిగ్రీలు.. మెడ బిగుసుకుపోయి ఉంది.

ఎక్కడినుండి వస్తున్నారు మీరు? ఎప్పటినుంచి ఉంది ఇలా? ఏమైనా మందులు వేసారా అంటూ అడిగింది.

ఇంటికాడ నుంచి వస్తున్నాం తల్లి.. పది నిమిషాల ముందు వరకు బాగున్నాడు .. పుట్టినరోజు అమ్మ ఇయ్యాల వీడిది ఏడుస్తూ చెప్పాడు ఓబులేసు.

అమృత, కమాన్ టైం లేదు Levipil,labetalol ఇంజక్షన్ ఇవ్వు అంటూ తొందర పెట్టాడు సుబ్బయ్య.

ఒకసారి గా తేరుకున్న అమృత ఫిట్స్ కోసం వాడే Levipilఅండ్ హై బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి వాడే labetalolఇంజక్షన్ వేసింది.

నర్స్ ఆక్సిజన్ క్విక్ అని చెప్పి గ్లూకోస్ డ్రిప్ స్టార్ట్ చేసింది.

అక్కడున్న అందర్నీ బయటికి పంపించి సుబ్బయ్య డాక్టర్ని మాత్రమే ఉండమని చెప్పింది అమృత.

సార్ ఇతను మీకు ఏమవుతాడు? ఇది చాలా సీరియస్ కేస్ లాగా ఉంది బ్రెయిన్ హేమరేజ్ కావచ్చు మెనింజైటిస్  కూడా అవ్వచ్చు ఏం చేద్దాం.. అని అడిగింది  

నాకు బాగా కావాల్సిన అబ్బాయి అమృత.. Please procced with the treatment. I will take the complete responsibility.. అని చెప్పాడు

ఓకే అంది అమృత భయపడుతూనే.. నర్స్ సిటీ స్కాన్, ఈసీజీ ,ఎలక్ట్రోలైట్స్, వరుసగా సూచనలు ఇవ్వడం మొదలు పెట్టింది

డాక్టర్ Here is the ECG report.. అందించింది నర్స్ శాంతి.

రిపోర్ట్ చూడగానే షాక్ కి గురైంది అమృత.

ST-T ఎలివేషన్.. మేజర్ హార్ట్ ఎటాక్ లా ఉంది సార్ సుబ్బయ్య వైపు తిరిగి చెప్పింది అమృత

మైకోకార్డియా ఇన్ఫర్క్యాకేషన్ .. ఇంత చిన్నపిల్లాడికి ..ఇంత హై బీపీ నా షాక్ లో ఉన్నాడు సుబ్బయ్య రిపోర్ట్ చూసి.

వాళ్లకి చెప్పమంటారా సార్,సుబ్బయ్య అని అడిగింది అమృత,  తన సమాధానం వినకుండానే నర్స్ వాళ్ళని పిలువు అంది..

ఓబులేసు, అతని తమ్ముడు, సావిత్రమ్మ గబగబా లోపలికి వచ్చారు.

వాళ్లని చూస్తూనే చెప్పడం మొదలుపెట్టింది అమృత..

బాబుకి చాలా సీరియస్ గా ఉంది, హై బీపీ వల్ల గుండెపోటు వచ్చింది, ICU లో చేర్పించాలి రక్తం గడ్డ కట్టకుండా ఇంజక్షన్లు వేయాలి..  24 గంటలు అవ్వకముందే ఏమి చెప్పలేను..  అని చెప్పడం ఆపేసింది

ఇప్పటిదాకా బాగున్నాడు ఇంతలోనే ఏమైంది ఇదంతా నమ్మలేనట్టు ముగ్గురు ఒకేసారి సుబ్బయ్య వైపు చూశారు.

 అతని ఏమి చెప్పకుండా అదంతా నిజం అన్నట్లు తల ఊపాడు.

ఓబులేసు సావిత్రి ని కొట్టడం మొదలుపెట్టాడు, ఏం చేసావే నా కొడుకుని, ఏమి విషం కలిపి పెట్టావు అంటూ.. ఆత్మీయులకి జరగరానిది జరిగినప్పుడు మనిషి విచక్షణ కోల్పోయి బలహీనంగా ప్రవర్తిస్తాడు అనడానికి అదే ఉదాహరణ..

కొడుక్కి అలా అయ్యిందే అని కన్నతల్లిని అనుమానిస్తున్నాడు

సత్య పెమానంగా చెప్తున్నా బావ.. నేనేం చేయాలా అంటూ సావిత్రి అతని కాళ్ళ మీద పడి ఏడుస్తుంది.

సుబ్బయ్య, ఓబులేసుని గట్టిగా తిట్టి బయటికి పంపించాడు నువ్వు మనిషివేనా.. కన్నతల్లి ఎక్కడైనా కొడుకుని చంపుకుంటుందా అని అరిచాడు.

ఇంతలో ఎందుకైనా మంచిది అని డాక్టర్ అమృత నక్షత్ర హాస్పిటల్ డైరెక్టర్ అయిన కిషోర్ కి సిచువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఫోన్ ఫోన్ చేసింది..

*******************************************************************************************************

గల గల పాడుతున్న గోదారిలా.. సెల్ఫోన్ రింగ్టోన్ మొగుతుండడంతో ఫోన్ డిస్ప్లే కూడా చూడకుండా హలో అన్నాడు డాక్టర్ అశోక్.

ఆరోజు అప్పటికి నాలుగు సర్జరీలు చేసి అలసిపోయి..  ఇంటికి రాగానే అలానే పడుకుండిపోయాడు అశోక్.. ఏ జీవికైనా ,మత్తు ,అపస్మారకంగా ఉండే సిచువేషన్ అలాంటిది.

అశోక్ సారీ, I know you must be very tired I just need a favour for one last time.. can you please attend this case.. అంటూ సిచువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కిషోర్

 నిద్రమత్తులో ఉండటంతో సరిగా వినలేదు అశోక్

Kishore I am not in a position to attend any more surgery. I am very much tired.. మత్తుగా అలసటగా ఉంది అంటూ కోపంగా చెప్పాడు అశోక్.

మళ్లీ తనే సరే డ్యూటీలో ఎవరున్నారు డీటెయిల్స్ చెప్పమనండి నాకు అర్థం అవుతుంది అన్నాడు.

You are impossible Ashok, let me add Amrutha to the bridge..అన్నాడు కిశోర్  

అమృత లైన్లోకి ఆడ్ చేశాడు కిషోర్.

అశోక్ సార్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది అమృత .. యంగ్ పేషంట్ ..హై బీపీ .. ఫిట్స్ ఈసీజీలో ST-T elevation.. ప్యూపిల్స్.. చెప్పడం పూర్తి పూర్తవకముందే..  ఐ విల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు .

******************************************************************************************************

ఐసీసీయూ

ఎప్పటిలాగే ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో..  నువ్వు ఎవరైతే నాకేంటి… నా పని నేను చేసుకుంటూ పోతా అంటూ బీప్ బీప్ మంటున్న మానిటర్ శబ్దాలతో ఉంది.

బెడ్ నెంబర్ 4,  అంటూ ఏమి మాట్లాడకుండా చేతి వేళ్ళు చూపించింది అమృత, డాక్టర్ అశోక్ కి

బెడ్ దగ్గర ఉన్న సుబ్బయ్య డాక్టర్ని ఒకసారి పలకరించి ఈసీజీ సిటీ స్కాన్ అండ్ బిపి చెక్ చేశాడు అశోక్.

ఓవర్ వెయిట్ లేడు, చాలా చిన్న ఏజ్,  షుగర్ లెవెల్ నార్మల్ గా ఉంది. ఇంత హైబీపీ ఎందుకు తనని తని క్వశ్చన్ చేసుకున్నాడు.

అశోక్ కి రిపోర్ట్స్ కంటే తన అనాలసిస్ మీద confidenceఎక్కువ.. తన జేబులోనుండి జాటర్ పెన్ను బయటకు తీసి టక్  టక్  మంటూ నొక్కడం మొదలెట్టాడు .. ఏదో తప్పు జరుగుతుంది.. ఫుడ్ పాయిజనింగ్.. క్వశ్చన్ చేసుకున్నాడు ఫుడ్ పాయిజన్ అయితే హార్ట్ ఎటాక్ రాకూడదు కదా..

ఒక రెండు నిమిషాల తర్వాత అర్థమైంది..

నర్స్ ఫైల్ అన్నాడు .. డాక్టర్ అశోక్

నర్స్ .. ఫైల్ తీసుకొచ్చే లోపు మళ్ళీ స్కేన్స్ రన్ చేశాడు.

ECG నార్మల్..  బిపి 170/90 తగ్గడం మొదలైంది.

ఫైల్ రాగానే డయాగ్నసిస్ కంక్లూజన్ రాశాడు

అది చూసినా అమృత,  డాక్టర్ this is impossible.

“What makes you say that? I don’t agree with your diagnosis. Did you check the patient’s family background?” కోపంగా చెప్పింది అమృత

కొకెయిన్ ఓవర్ డోస్ .. అక్ క్యూట్ కరోనరీ స్పాస్మ్ .. ఫిట్స్ , High BP,  డయాగ్నొసిస్ సెక్షన్లో రాశాడు అశోక్.

తను కూడా ఇదే అనుకున్నాడు అన్నట్లు.. ఫైల్ చూసి ఏదో ఆలోచనలో ఉన్నాడు సుబ్బయ్య.. చాలా సేపట్నుంచి శీను  కి ఆ డ్రగ్ ఎలా వచ్చిందో  అని ఆలోచిస్తున్నాడు.

అశోక్ , సుబ్బయ్య వైపుకు తిరిగి సర్ లీగల్ ప్రొసీడింగ్స్ కి స్టార్ట్ చేద్దామా అని అడిగాడు.

సుబ్బయ్య సందిగ్ధంలో పడ్డాడు.. లీగల్ ప్రొసీడింగ్స్ అంటే శీను భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే ..

అది గమనించిన వాడల్లా,  అశోక్  చెప్పడం మొదలెట్టాడు.. “I understand it’s a chaotic situation that affects someone’s future. But at the same time, we need to be responsible to our society.”

ఇది ఎంతవరకు దారితీస్తుందో నేను చెప్పలేను, మీరు ఒప్పుకుంటే నేను ఇబ్రహీంతో మాట్లాడుతాను. ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. హాస్పిటల్ కి కూడా మన వల్ల డామేజ్ అవ్వకుండా నేను కిషోర్ ని ఒప్పిస్తాను అని చెప్పాడు.

అశోక్ చెప్పిన దాంట్లో తప్పేం లేదనిపించింది పైగా ఇబ్రహీం చాలా సమర్థమైన ఆఫీసర్ అని తెలుసు అందుకే సరే అని ఒప్పుకున్నాడు.

అశోక్ , ఇన్స్పెక్టర్ ఇబ్రహీం నెంబర్ కి డయల్ చేసి హాస్పిటల్ కి అర్జెంటుగా రమ్మని చెప్పాడు

అతను వచ్చే లోపు కిషోర్ కి కూడా జరిగింది అంతా ఎక్స్ప్లైన్ చేశాడు.

ఒక పది నిమిషాల తర్వాత ఎస్సై ఇబ్రహీం నక్షత్ర హాస్పిటల్ అశోక రూమ్ లో ఉన్నాడు.

అక్కడే ,సుబ్బయ్య మరియు అమృత కూడా అతని కోసమే వెయిట్ చేస్తున్నట్లు ఉన్నారు.

అశోక్ సోది లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాడు.. ఇన్స్పెక్టర్ ఇది ఒకటి టిపికల్ కేస్ నా డయాగ్నెన్సీస్ చెప్తుంది పేషెంట్ హై డోస్  కొకెయిన్ కంసుమ్  చేశాడని.. బట్ తన అవుటర్ బాడీ మీద ఎలాంటి డ్రగ్ పార్టికల్స్ లేవు .. ఇంజక్షన్ మార్క్స్ కూడా లేదు .. మోరెవర్ డ్రగ్స్ బై చేసి కన్జ్యూమ్ చేసేంత  రిచ్ ఫ్యామిలీ కూడా కాదు.. But  ఏదో తప్పు జరుగుతుంది

మిమ్మల్ని పిలవడానికి రీసన్ ఏంటి అంటే, ఈ కేస్ ని ఎఫ్ ఐ ఆర్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి.

“I just found out from Subbaiah sir that the boy is very intelligent and topped the college in his intermediate exams. If we include his name in the FIR, his future could be at risk.”అని చెప్పడం ఆపేసాడు అశోక్ .

డాక్టర్ మీరు చెప్పింది కరెక్టే పిల్లాడి ఫ్యూచర్ ప్రమాదంలో పడొచ్చు వితౌట్ ఎఫ్ ఐ ఆర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే.. “You need to understand that I have to handle many obligations, and you’re well aware of that. If the boy hasn’t committed any crime, we can clear this up easily.”

ఇబ్రహీం సార్ నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మన జ్యూడిషియల్ సిస్టం గురించి ఒకసారి ఎఫ్ఐఆర్లో నోట్ అయితే ఎప్పుడు బయటపడతాడు చెప్పడం మన వల్ల అవుతుందా.. I will take complete responsibility please do this favour  అంటూ రిక్వెస్ట్ చేశాడు అశోక్.

సరే డాక్టర్ మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. బట్ నా ఇన్వెస్టిగేషన్లో ఏదైతే తేడాగా వస్తే నేనేం చేయలేను అన్నాడు. ఇంతకీ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయా అని అడిగాడు ఇబ్రహీం.

ఇంకా లేదు రేపు ఉదయానికల్లా వస్తాయి వచ్చాక మీకు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాడు అశోక్.

Let the reports come then I will start my investigation అంటూ అక్కడనుండి వెళ్లిపోయాడు ఇబ్రహీం

ప్రతి అరగంటకి ఒకసారి రీడింగ్స్ పంపిస్తూ ఉండమని చెప్పి  ఇంటికి వెళ్ళిపోయాడు అశోక్.

ఒక ఐదు గంటల తర్వాత స్కాన్స్ అన్ని నార్మల్గా వచ్చాయి బిపి 130/84 కనుపాపలు నార్మల్ గా ఉన్నాయి.

తర్వాతి రోజు తెల్లవారుజాముకి శీనుకి స్పృహలోకి వచ్చాడు.. ఇప్పుడు అంతా నార్మల్ గా ఉంది

డాక్టర్ అమృత ఎగ్జామినేషన్ చేసి డిశ్చార్జ్ సమ్మర్ లో ఫుడ్ పాయిజనింగ్ అని రాసి పెట్టుకుంది

డిస్చార్జ్ చేసి టైంలో శీను ని సపరేట్గా పిలిచి ..ఏమైనా చేయకూడని పనులు చేసావా నేను ఎవరికీ చెప్పను చెప్పు అని అడిగింది.

లేదు డాక్టర్ అని చెప్పాడు శీను.

అతన్ని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నువ్వు వెళ్లొచ్చు అని చెప్పింది.

తర్వాతి రోజు ఉదయం 11:30 కి శీను బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి.

అమృత వాటిని డాక్టర్ అశోక్ కి ఫార్వర్డ్ చేసింది .

రిపోర్ట్ చూసిన అశోక్ కి కొద్దిగా బాధ వేసింది..  మొదటిసారి తన అనాలసిస్ తప్పయినందుకు అదే సమయంలో సంతోషం కూడా వేసింది ఇబ్రహీం ఇన్వెస్టిగేషన్ చేయడానికి క్లూ దొరికినట్లు.

రిపోర్ట్స్ లో ractopamine అనే డ్రగ్ ఉన్నట్లు తేలింది.

ఇబ్రహీం వాట్సాప్ కి రెండు మెసేజెస్ వచ్చాయి

  1. They found ractopamine In boy’s blood
  2. If possible can you visit hospital once

అని..

సేమ్ మెసేజ్ సుబ్బయ్యకి కూడా పంపించాడు డాక్టర్ అశోక్.

లంచ్ తర్వాత అమృత, సుబ్బయ్య ,ఇబ్రహీం డాక్టర్ అశోక్ రూమ్ లో కలిశారు.

సుబ్బయ్య మాట్లాడటం మొదలుపెట్టాడు..”It’s now clear that it’s due to food poisoning. I found out from the boy’s mother that he ate chicken curry before being brought to the hospital.”

But how come, ractopamine is banned కదా.

అవును సార్ ractopamine  drug is banned in 160 nations.  Unfortunately due to high meat demand it’s not banned in the USA , UK and other big countries. It’s very easily available in IndiaMart for cheaper price ..అంటూ చెప్పుకుపోతున్నాడు ఇచ్చాడు అశోక్

కొంచెం అర్థం అయ్యేలా చెప్తారా మధ్యలో కలగ చేస్తున్నాడు ఇబ్రహీం

Sorry inspector, let me explain you అంటూ స్టార్ట్ చేశాడు అశోక్.

ractopamine అనేది  ఒక beta-agonists like డ్రగ్ అనిమల్స్ లో మజిల్స్ వేగంగా పెరగడం కోసం ఈ డ్రగ్ని వాడుతారు, ముఖ్యంగా కోళ్లు మరియు పందుల పెంపకంలో. It stimulates the protein synthesis. ఈ meat ni పెద్ద మొత్తంలో మనుషులు తిన్నప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.. ఉన్నట్టుండి,  గుండె కొట్టుకునే వేగం పెరగడం, హై బ్లడ్ ప్రెషర్,కను గుడ్లు వాచడం లాంటిది..

ఇప్పుడు మనం లైవ్ లో చూసాం కదా.. ఇవే సింప్టమ్స్ కొకైన్ వాడినప్పుడు కనపడతాయి

Oh now it makes sense doctor.. నాటుకోడికి మనం ఎంత దానా పెట్టినా కూడా మజిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదే బ్రాయిలర్ కోడిని తీసుకున్నప్పుడు చూడటానికి చాలా పుష్ఠిగా ఉంటాయి అని చెప్పింది డాక్టర్ అమృత

ఎగ్జాక్ట్లీ.. ఒక హెల్తీ చికెన్ యొక్క లెగ్ ని మనం అరచేతిలో పట్టుకున్నప్పుడు అది మనిషి పిడికిలిలో పట్టేస్తుంది బట్ ఇప్పుడు మనం చూస్తున్న బ్రాయిలర్ కోళ్ల చూసారా ఎంత సైజులో ఉంటున్నాయో..

I have a question here.. అంటూ తన చేతిని పైకెత్తాడు ఇన్స్పెక్టర్ ఇబ్రహీం

ఈ  డ్రగ్స్ కోళ్ల మీద ఎందుకని ప్రభావం చూపించడం లేదు?

ఎవరన్నారు ప్రభావం చూపడం లేదని.. డ్రగ్ అప్లై చేసిన మొదటి గంటలో ఇవే సింప్టమ్స్ మనం వాటిలో కూడా చూడొచ్చు..  సమయం పెరిగే కొద్దీ డ్రగ్ ప్రభావం తగ్గిపోతూ వస్తుంది..  ఎందుకంటే వాటికి దేవుడు ఒక అద్భుతమైన అవయవాన్ని ఇచ్చాడు..  అదే దాని లివర్..  ఎటువంటి టాక్సిన్స్ అయినా అది ప్రాసెస్ చేసుకోగలరు..  ఎటువంటి విషాన్నైనా అది నిర్వీర్యం చేయగలరు..  ఇంకా చెప్పాలంటే అది సీసం తిన్న కూడా అరిగించుగోకలదు

Unfortunately, their bodies are not equipped to fully eliminate the residues of synthetic growth promoters like ractopamine, antibiotics like tetracyclines, and even coccidiostats. ఇలాంటి సమయాల్లో , ఐ మీన్ డ్రగ్స్ ఉన్న మీట్ తిన్నపుడు హుమన్స్ లో చాల ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే శీను కేసు లో ఇదే జరిగి ఉంటుంది .. అంటూ చెప్పడం ఆపేసాడు

బట్ వై డాక్టర్ ఎందుకని ఇలా చేస్తున్నారు అడిగాడు ఇబ్రహీం.

“ఎవర్ గోయింగ్ డిమాండ్ ఫర్ చికెన్ మీట్” ఒక చిన్న సైజు పెళ్లి జరిగితేనే యావరేజ్ గా 1 నుంచి 2 టన్నుల చికెన్ అవసరం అవుతుంది. సండే వస్తే ఒక చిన్న టొన్ అయినా మన ప్రొద్దుటూరులోనే కొన్ని వందల టన్నుల  చికెన్ కావాలి ఎక్కడినుండి తీసుకొస్తారు .. అందుకే ఈ పౌల్ట్రీ వ్యాపారస్తులు యాంటీబయాటిక్స్ గ్రోత్ ప్రమోటర్స్, రక్టోపమిన్ లాంటి డ్రగ్స్ వాడుతుంటారు.

ఇక్కడ మీకు ఇంకో అతి భయంకరమైన విషయం చెప్తాను వినండి అంటూ అశోక్ సమాధానాన్ని కంటిన్యూ చేశాడు

మనం చిన్నప్పుడు ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి? అసలు ఆ పేరైనా మనం విన్నామా? ఇప్పుడు మన ఊర్లో ఎన్ని సెంటర్స్ ఓపెన్ అయ్యాయి? దాదాపు 8 ఉన్నాయి ఇదిగో ఇంకోటి ఆడ్ అవుతుంది అంటూ కొత్తగా ఓపెన్ చేయబడుతున్న ఆరుషి ఫెర్టిలిటీ సెంటర్  ఇన్విటేషన్ కార్డు చూపించాడు.

దానికి రీసన్స్ ఏమై ఉంటుందో ఎవరైనా గెస్ చేయగలరా ?

గ్రోత్ ప్రమోటర్స్ , యాంటీబయాటిక్స్, డ్రగ్స్ ఇంజెక్ట్ చేయబడిన ఫుడ్ ని లార్జ్ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయడం వల్ల.  దీని వల్ల హ్యూమన్స్ ప్రొడక్టివ్ సిస్టం అతి దారుణంగా దెబ్బతింటుంది.

 ఒక అమెరికన్ రీసెర్చ్ రీసెంట్ గా ఏం చెప్పిందంటే ప్రతి ఐదుగురిలో నలుగురికి హార్మోనల్ ఇంబ్యాలన్సు, టీనేజ్ అమ్మాయిల్లో PCOD, PCOS లాంటి సమస్యలు.

ఆంటీబయాటిక్స్ చాల పెద్ద మొత్తములో లో మనకు తెలియకుండానే కన్ఫ్యూమ్ చేయడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ అన్నీ ఇప్పుడుanti-biotic resistance అయ్యాయి

Damn..  ఇదంతా జనాలకి ఎలా తెలుస్తుంది డాక్టర్ ఇబ్రహీం అడిగాడు

పబ్లిక్ హెల్త్ మీటింగ్స్ కండక్ట్ చేసి జనాలు అవేర్నెస్ తీసుకురావాలి ..ఇలాంటి contaminated food తినడం వల్ల జరిగే నష్టాలను ఎక్ష్ప్లైన్ చేయాలి.  పౌల్ట్రీస్ అదర్ ఫుడ్ ఇండస్ట్రీస్ మీద కంటిన్యూస్ రైడ్ జరుగుతుండాలి, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే ప్రతి ఒక్కరికి ఇన్స్టంట్ అండ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ ఆవేశంగా చెప్పకపోతున్నాడు డాక్టర్ అశోక్.

ఇదంతా విన్నాక ఇబ్రహీంకి తన రెండేళ్ల కూతురు మర్యమ్ గుర్తొచ్చింది తనకి జీవితంలో చికెన్ తినిపించను నీ మనసులో అనుకున్నాడు.

సరే డాక్టర్స్ నేను ఇంకా బయలుదేరుతాను చాలా వర్క్ ఉంది అంటూ అక్కడున్న అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బైటకి నడిచాడు

నక్షత్ర హాస్పిటల్స్ పార్కింగ్ ఏరియాలో ఉన్న తన బుల్లెట్ ని స్టార్ట్ చేసి సదాశివమ్ పౌల్ట్రీ వైపు వెళ్లే రోడ్డు ఎక్కాడు..

0 0 votes
Article Rating
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sarath
Sarath
1 month ago

Nice story