Contemporary Fiction

స్వర్గానికి దారి

275.00

పెళ్లి చేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని, ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా సర్దుకుపోయి జీవించడమే జీవితం అని భావించే తల్లిదండ్రులు ఉన్నంతకాలం… ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లగానే మిగిలిపోతుంది.
పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మాట విని, పెళ్లయ్యాక భర్త మాటను అనుసరించడమే ఆడపిల్ల జీవితం కాదు. ఆడపిల్లకూ ఒక మనసుంటుంది. ఇష్టాయిష్టాలు ఉంటాయి. కలలు, కోరికలు ఉంటాయి. తను కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకునే హక్కు కూడా ఉంటుంది.
కూతురి ఇష్టాన్ని తెలుసుకుని పెళ్లి చేసే తల్లిదండ్రులు ఎంతమంది?
రామాయణాన్ని, సీతారాములను ఆదర్శంగా తీసుకునే మన సమాజం… సీతా స్వయంవరాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోదు? జనక మహారాజు తన కుమార్తె ఇష్టాన్ని తెలుసుకుని, ఆమె ఎంచుకున్న వ్యక్తితో వివాహం జరిపించాడు. పురాణాల్లోని రాణులు సైతం స్వయంవరాల్లో తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కును కలిగి ఉండేవారు.
మరి నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ స్త్రీకి దక్కింది ఏమిటి?
ఈ కథలోని ఆడపిల్ల… మీ ఇంట్లో అక్కగానో, చెల్లెలిగానో, తల్లిగానో, భార్యగానో ఉండే ఉంటుంది. ప్రతి ఆడపిల్ల ఈ కథలోని ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కొనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఒక ఆడపిల్ల మనసును మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే — “స్వర్గానికి దారి”

Ninnu kori

275.00

మొగుడి మంచితనం సంవత్సరం కాపురం చేసిన నాకంటే నాలుగు సార్లు కలిసిన నీకు బాగా అర్థం అయ్యిందా అంది లావణ్య. ఐనా మంచివాడు చెడ్డవాడు అన్నది సమస్య కాదు, అక్కని పెళ్లి చేసుకుని విడిపోయినవాడితో నీకు ప్రేమ ఏంటి. చదువు మానేసి అతని వెనక పడుతున్నావ్ అనే రప్పించింది, పెళ్లి సంబంధం చూసింది అన్నాడు రాఘవ.

నాకు ఇష్టం లేదు, నేను బావని ప్రేమిస్తున్నా అంది శ్రీజ.

ఒసేయ్! మంచివాళ్ళు కథల్లో, సినిమాల్లో,ఇంకా దూరంగా చూడటానికి బాగుంటారు కానీ కలిసి బ్రతకడానికి కాదు అంది లావణ్య.

ఒక్కసారే కళ్ళు పెద్దగా తెరిచి చూసింది శ్రీజ, కళ్ళు ఎరుపుగా ఉండడం వల్ల రౌద్రం కనపడుతోంది ఆమె కళ్లలో. నిజానికి ఆమె కళ్ళు చూసి అందరికి భయం వేసింది.

నాన్నా! నేను అడిగానా మిమల్ని డాక్టర్ చదివించమని, మీరు చదవమన్నారు.